రాత్రివేళ ములుగు జలపాతం వద్ద చిక్కుకున్న 40 మంది పర్యాటకులు: రంగంలో ఎన్డీఆర్ఎఫ్
ములుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తుతోంది.
బుధవారం రాత్రి 9:30 గంటల సమయానికి భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వరద ప్రవాహం 48 అడుగులకు చేరింది. దీనితో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం.. వంటి మండలాల వెళ్లే రహదారులపై వరదనీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ పరిణామాల మధ్య ములుగు జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలో గల ముత్యాలధార జలపాతాన్ని చూడటానికి వెళ్లిన పర్యాటకులు అక్కడ చిక్కుకున్నారు. వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల ఉన్న దట్టమైన అడవిలో దారి తెన్ను తెలియని పరిస్థితిలో 40 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టింది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను రంగంలోకి దించింది. పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడటం, భారీ వర్షం పడుతోండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

వెంకటాపురం మండలంలో దట్టమైన అడవుల మధ్య ఉంటుంది ముత్యాలధార వాటర్ ఫాల్స్. జాతీయ రహదారి నుంచి సుమారు 12 కిలోమీటర్లు అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది దీన్ని చేరుకోవాలంటే. వాటర్ ఫాల్స్ వరకూ వాహనాల్లో వెళ్లడానికి అనువైన రోడ్డు లేదు. మూడు కిలోమీటర్ల దూరంలో వాటిని ఆపేసి.. కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.
కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ముత్యాలధార.. జలకళను సంతరించుకుంది. దీన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తోన్నారు. భారీ వర్షాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ అధికారులు ముత్యాల ధార జలపాతాన్ని సందర్శించడాన్ని నిషేధించారు. పర్యాటకులు దీన్ని లెక్క చేయట్లేదు.

కొందరు పర్యాటకులు ప్రకృతి అందాలకు తిలకించడానికి కార్లలో వెంకటాపురానికి వచ్చారు. అక్కడి నుంచి వేరే వాహనంలో ముత్యాలధార జలపాతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదే సమయంలో భారీ వర్షం కురవడం, మార్గమధ్యలో వాగులు, వంకలు పొంగిపొర్లుతోండటం వల్ల బయటికి రాలేకపోయారు. అక్కడే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రత్యేక బస్సులో వెంకటాపురానికి చేరుకున్నాయి. పర్యాటకులను రక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోన్నాయి. చీకటి పడటం, దట్టమైన అటవీ ప్రాంతం కావడం, భారీ వర్షం పడుతోండటం.. సహాయక చర్యలకు ఆటంకాన్ని కలిగిస్తోన్నాయి.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications