కండలు చూపించి మహిళలతో అసభ్యంగా: అడ్డంగా బుక్కయ్యాడు..
కోచింగ్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్లను తన కండలతో ఆకట్టుకోవడానికి ఆకతాయి వేషాలు వేస్తూ వస్తున్నాడు.
నాగోలు: కండలు పెంచి అమ్మాయిల ముందు పోజులు కొట్టేవాళ్లకు ఈరోజుల్లో కొదువలేదు. సిక్స్ ప్యాక్ లాంటి సినిమా ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తామూ హీరోలమే అన్న లెవల్‌లో బిల్డప్ ఇస్తుంటారు.
తాజాగా ఇదే తరహాలో వ్యవహరించిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. ఎల్బీనగర్ ఎస్ఐ శ్రీను వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు జి.జనార్దన్ రెడ్డి(40) ఇటీవల బాగా కండలు పెంచాడు. సైనిక్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే రియాన్ కోచింగ్ సెంటర్ కు ఆయన డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

బండ్లగూడలోని మత్తుగూడలో ఈ కోచింగ్ సెంటర్ ఉంది. దీంతో కోచింగ్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్లను తన కండలతో ఆకట్టుకోవడానికి ఆకతాయి వేషాలు వేస్తూ వస్తున్నాడు. మహిళలు కనిపించగానే కండలు చూపించడం.. ఈల వేసి వారిని విసిగించడం.. తదేకంగా చూస్తూ వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడు.
ఇతగాడి చేష్టలకు భయపడి బయటకు రావాలంటేనే మహిళలు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ధైర్యం చేసి అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.












Click it and Unblock the Notifications