బలవంతంగా యువతుల్ని వ్యభిచారంలోకి: 41మందిలో 18 మంది స్త్రీలే
హైదరాబాద్: అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న ట్రాఫికర్స్‌ను తెలంగాణ సిఐడి పోలీసులు గురువారం నాడు న్యాయస్థానంలో హాజరుపరిచారు. మొత్తం 41 మంది ట్రాఫికర్స్‌ను అరెస్టు చేయగా, అందులో 18 మంది మహిళా ట్రాఫికర్స్ ఉన్నారు.
ఇటీవల వ్యభిచార గృహం నుంచి తప్పించుకొని వచ్చిన ఓ యువతి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

150 మందితో కూడిన సిఐడి బృందం నాలుగు రోజుల పాటు దాడులు నిర్వహించింది. ఈ దాడులలో 18 మంది మహిళలు సహా 41 మంది ట్రాఫికర్స్‌ను అరెస్టు చేశారు. 39 మందిని యువతులను రక్షించారు.
అందులో 31 మంది యువతులు, 8 మంది పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల పేరుతో యువతులను, మహిళలను మహారాష్ట్రకు తీసుకెళ్తున్న ట్రాఫికర్స్.. వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. తెలంగాణ సిఐడి కాపాడిన వారిలో 22మంది తెలంగాణ యువతులు, 7గురు చిన్నారులు ఉన్నారు.












Click it and Unblock the Notifications