ఎర్రవల్లిలో 45 ఎకరాల మిస్సింగ్ భూమి ఎక్కడ? సర్వేకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న భూమి రికార్డులను సమర్పించాలని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తి చేయటానికి డెడ్ లైన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి!
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తి చేయటానికి డెడ్ లైన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి!

22 ఏపై శాసనసభలో గత నెల 16వ తేదీన నిర్వ‌హించిన చర్చలో ఆ భూముల‌పై విచార‌ణ‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విచారణ పురోగతిపై మంగళవారం రాత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ‌ సమీక్షా సమావేశంలో ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై విచార‌ణ‌కు వేసిన కమిటీ, ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విచార‌ణ పురోగ‌తిపై సీఎం క‌మిటీ స‌భ్యుల‌ను ప్ర‌శ్నించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉందని, కానీ తాజా సర్వేలో 343 ఎకరాల భూమి మాత్రమే ఉన్న‌ట్లు గుర్తించామ‌ని సీఎంకు అధికారులు వివ‌రించారు. రికార్డులో ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉందని అధికారులు తెలియ‌జేశారు.

45 Acres Missing in Erravalli CM Revanth Reddy Orders Survey Notices to KCR Family Full Details Here

ఈ నేప‌థ్యంలో ఆ 45 ఎకరాల భూమిని తేల్చేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వేకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స‌ర్వే నెంబ‌ర్ 325 స‌మీపంలోనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందున‌, వారి భూముల రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు తెలిపారు.

ఎర్రవల్లి భూములపై సర్వే.. కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఎందుకింత రాజకీయం?
ఎర్రవల్లి భూములపై సర్వే.. కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఎందుకింత రాజకీయం?

సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం 'తెలంగాణ అమరవీరుల కాలనీ'ని నిర్మించాలని సీఎం ఆదేశించారు.అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో కాలనీని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖ‌కు అప్ప‌గించాల‌ని, వచ్చే జూన్ 2లోగా తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మరోవైపు కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు, మిషన్ భగీరథ భూములు మినహా మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ తోపాటు ఎడ్యుకేష‌న్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎల్‌నినో నేప‌థ్యంలో రిజ‌ర్వాయ‌ర్లు, చెరువుల నీటిని జాగ్ర‌త్త‌గా వినియోగించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినిగియోంచే వారిని గుర్తించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ప్రాంతం ఆయనకు రాజకీయంగా, వ్యక్తిగతంగా అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే. గతంలో కేసీఆర్ ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతుండటంతో దీనిని రాజకీయంగానూ ఓ ముఖ్య కేంద్రంగా భావిస్తారు. దాదాపు మూడు వారాల క్రితం శాసనసభలో ఈ భూముల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించగా.. ఇప్పుడు అధికారికంగా విచారణ, నోటీసుల జారీ దశకు చేరుకుంది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ స్పందన ఎలా ఉండబోతుందనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+