కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 463 కేసులు... నలుగురు మృతి
తెలంగాణలో కొత్తగా 463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్‌కి కాస్త అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. మరో 906 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (మార్చి 30) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1694కి చేరింది. ప్రస్తుతం 4678 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 1723 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 364 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,00,833కి చేరింది.

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.3శాతం ఉండగా... తెలంగాణలో 0.55శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 94.2శాతం ఉండగా తెలంగాణలో 97.92 శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 145 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,95,487 కరోనా టెస్టులు నిర్వహించారు.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 56,211 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.20కోట్లకు చేరింది.మరో 271 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1.62లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.40 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 37,028 మంది కరోనా కోలుకోగా... ఇప్పటివరకూ మొత్తం 1.13కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ 6,11,13,354 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications