Ravan: రావణ్ ఫోన్లో ఆ వీడియోలు ? మహిళల బ్లాక్ మెయిలింగ్ తో ..!
ఏపీలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)కింద అరెస్టు అయిన యూట్యూబర్ రావణ్ (Ravan) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా రావణ్ ఫోన్ ను తెరిచిన పోలీసులకు కీలక వీడియోలు లభించాయి. ఇందులో లభించిన వీడియోలతోనే రావణ్ మహిళల్ని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రావణ్ పై మరిన్ని కేసులు బనాయించేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
గత నెలలో హైదరాబాద్ లో రావణ్ ను అరెస్టు చేసి పిఠాపురం తీసుకొచ్చిన పోలీసులు.. అనంతరం కోర్టులో హాజరుపర్చాక బెయిల్ లభించింది. అనంతరం ఈ నెల 2న కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ సమయంలో రావణ్ ఫోన్ సీజ్ చేశారు. ఈ ఫోన్ ఇప్పటికీ పోలీసుల దగ్గరే ఉంది. దీన్ని తాజాగా పరిశీలించిన పోలీసులకు మహిళలతో అతను సన్నిహితంగా ఉన్న వీడియోలు కనిపించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని తన స్టూడియోలోనే రహస్య కెమెరాల ద్వారా రావణ్ ఈ వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు.

అలాగే ఈ వీడియోల ద్వారా పలువురు మహిళలను రావణ్ బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆధారాలు లభించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ వీడియోలను చూపించి రావణ్.. ప్రతీ నెలా బ్లాక్‌మెయిల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్లు వారు తెలిపారు. తాజా వీడియోల నేపథ్యంలో రావణ్ బాధితులు ఎవరైనా ఉంటే తమను కలిసి వివరాలు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఇలా వివరాలు ఇచ్చే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇస్తున్నారు. ఇప్పటికే రావణ్ పై ఉపా కేసు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులు.. ఈ వీడియోల వ్యవహారం బయటికి తీసుకురావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.














Click it and Unblock the Notifications