Prasna Ravan: అరెస్టు-బెయిల్ మధ్య రావణ్..! తగ్గని పోలీసులు-మధ్యలో జనసేన..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అరెస్టు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna ravan) కు వరుసగా కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నాయి. అయినా పోలీసులు తిరిగి అరెస్టు చేస్తున్నారు. ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ లభించగా.. తిరిగి కాకినాడ, బందరు, అనకాపల్లి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ప్రతీ కోర్టూ రావణ్ కు బెయిల్ మంజూరు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది.

ప్రశ్న రావణ్ ను పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల కేసులో హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు పిఠాపురం తీసుకొచ్చారు. అక్కడ కోర్టు బెయిల్ ఇవ్వడంతో కాకినాడ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు, అనంతరం అక్కడా బెయిల్ రావడంతో మచిలీపట్నంలోని ఇనుగుదురు పోలీసులు అరెస్టు చేశారు. అక్కడా రాత్రి బెయిల్ లభించడంతో అనకాపల్లిలోని పాయకాపురం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇవాళ వారాంతం కావడంతో కోర్టులకు సెలవు. దీంతో స్థానిక మెజిస్ట్రేట్ అయిన ఆర్డీవో ముందు ప్రవేశపెట్టి ఎలాగైనా జైలుకు పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు రావణ్ లాయర్ జడ శ్రావణ్ కుమార్ ఆరోపిస్తున్నారు.

Arrest Bail Re-Arrest Prasna Ravan Case Puts Police Procedure Under Lens janasena attempts to attack

మరోవైపు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన రావణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ వదిలిపెట్టరాదని భావిస్తున్న జనసైనికులు ఆయన్ను ఏ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తే అక్కడికి వెళ్లి రచ్చ రచ్చ చేస్తున్నారు. తమకు రావణ్ ను అప్పగించాలని పోలీసుల్ని ఒత్తిడి చేస్తున్నారు. రావణ్ పై దాడికి వీరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇవాళ కూడా వీరి బారి నుంచి రావణ్ ను భద్రంగా తరలించాల్సిన పరిస్ధితులు తలెత్తాయి. మరోవైపు రావణ్ అరెస్టు, బెయిళ్ల వ్యవహారం జాతీయ స్ధాయిలో చర్చనీయాంశంగా మారింది. వరుసగా కోర్టులు బెయిల్స్ ఇస్తున్నా ఒకే వ్యాఖ్యల కేసులో వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టు చేసి వేధిస్తుండటంపై ఇవాళ పలు జాతీయ మీడియా ఛానళ్లు, వెబ్ సైట్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇందులో ఏపీ పోలీసుల తీరును తప్పుబడుతున్నాయి. అయినా పోలీసులు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+