"నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది"

అరుదైన వ్యాధితో బాధపడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్(17) మంగళవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. అయితే నిరంజన్ మృతిపై పవర్ స్టార్, జన సేనాని పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం అయిన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు.

"కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి.. నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు.. ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.

అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.

నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్.. నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ ట్వీట్ పెట్టారు.

ఇక జూన్ 17 న నిరంజన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే. నిరంజన్ కోసం ఓజీ 2 షూటింగ్ ను పూర్తి చేస్తానని.. సినిమాను ఫస్ట్ తనకే చూపిస్తానని పవన్ కల్యాణ్ ఆ బాలుడికి హామీ ఇచ్చారు. కానీ ఇంతలోనే ఇలాంటి విషాదం జరగడంపై అటు నిరంజన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే జనసేన నేతలు, స్థానికులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

PawanKalyan Becomes Emotional Over Death of Ardent Fan Niranjan from Rare Disease Niranjan death

హన్మకొండకు చెందిన పొనుగోటి రామ్ గోపాల్‍, మాసన దంపతుల కుమారుడు నిరంజన్‌‌‌‌‌‌‌‌ మూడో ఏట నుంచే డ్యూచెన్‌‌‌‌‌‌‌‌ మస్య్కులర్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రోఫి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. మూడో ఏట నుంచే మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఈ వ్యాధి ప్రభావం కారణంగా 17 ఏళ్ల వయసు వచ్చినా కూడా నిరంజన్ కేవలం నాలుగేళ్ల చిన్నారి రూపంలోనే ఉండిపోయాడు. చివరి వరకూ వ్యాధితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+