రాజీనామాకు సిద్ధం- సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్..!!
మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్వహణ పైన మండపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ది నేరపూరిత నిర్లక్ష్యమని మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. నీళ్లు ఉండి కూడా లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో రేవంత్ కు సవాల్ చేసారు.
మాజీ మంత్రి హరీష్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆసక్తికర విశ్లేషణ చేసారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్‌డీఎస్‌ఏ(NDSA) సాకు చెబుతున్నారని.. మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజీ దగ్గర లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉందని చెప్పుకొచ్చారు. గోదావరి నీళ్లు తీసుకోవాలన్న కనీస సోయి లేదని విరుచుకుపడ్డారు. చెరువులు నింపుకునే అవకాశం ఉన్నా.. నింపడం లేదన్నారు. వరంగల్ జిల్లాలో 90 శాతం చెరువులు ఎండిపోయాయని, దేవాదుల మోటార్లు పూర్తిస్థాయిలో నడపడం లేదని తెలిపారు. మోటార్లు ఆన్ చేయకుండా.. నీళ్లను దిగువకు వదులుతున్నారని అన్నారు. గురుదక్షిణగా తెలంగాణ నీటిని ఏపీకి వదులుతున్నారని హరీష్ ఫైర్ అయ్యారు. నీళ్లు ఉండి కూడా లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అని వ్యాఖ్యానించారు.

రేవంత్ లక్ష్యంగా
రేవంత్ తాజాగా కాళేశ్వరం పైన చేసిన ప్రసంగంలో నిజం లేదని చెప్పారు. తుమ్మిడి హెట్టికి అనుమతులున్నాయని అబద్ధాలు చెప్పారని.. అనుమతులుంటే తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని నిలదీశారు. 8 ఏళ్లు కేంద్రం, రాష్ట్రం, మహారాష్ట్రలో అధికారంలో ఉండి ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. పనులు చేయకుండా తుమ్మిడిహెట్టి పేరిట రూ.2,328కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నీటి పారుదల మంత్రిగా ఉత్తమ్, సీఎంగా రేవంత్ విఫలం అంటూ వ్యాఖ్యానించారు. 'తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర అనుమతి ఇచ్చి ఉంటే అగ్రిమెంట్ బయటపెట్టాలి. ఒప్పందం బయటపెడితే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. లేకపోతే సీఎం రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని సీఎం రేవంత్ కు హరీశ్ సవాల్ విసిరారు.













Click it and Unblock the Notifications