Free bus: కిక్కిరిస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులు, రికార్డు స్థాయిలో ప్రయాణాలు నమోదు
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. అంతేగాక, ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ఆర్డినరీ, ఎక్ప్ ప్రెస్ తోపాటు మెట్రో బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించడంతో సిటీ బస్సుల్లోనూ రద్దీ పెరిగింది.
ఈ క్రమంలోనే సోమవారం రోజున టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించడం గమనార్హం. 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) మునిశేఖర్ తెలిపారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య సోమవారానికి మరో 9 లక్షలు పెరిగిందని ఆయన తెలిపారు.

ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం, కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారని మునిశేఖర్ వెల్లడించారు. కాగా, ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయాల్సి వస్తే వేలల్లో ఖర్చు అయ్యేదని, ఇప్పుడు తమకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్థికంగా ఉపశమనం కలిగిందని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడవారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ఇది ఇలావుంటే, ఈ ఉచిత పథకం వల్ల మహిళలు ఎవరూ ఆటోల్లో ప్రయాణించడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. సాధారణంగా తమ ఆటోల్లో ఎక్కువగా ప్రయాణించేది ఆడవారేనని, ఇప్పుడు ఈ పథకం వల్ల తాము నష్టపోతున్నామని అంటున్నారు. ప్రభుత్వం తమకు కూడా ఎదైనా దారి చూపాలని కోరుతున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications