టీ తాగేందుకు వెళ్లిన పేరెంట్స్: బస్టాప్‌లోని 6 నెలల చిన్నారిని లాక్కెళ్లి చంపిన కుక్క
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. ఆరు నెలల చిన్నారిని ఓ కుక్క లాక్కెళ్లడంతో అక్కడికి అక్కడే మృతి చెందిన విషాధ సంఘటన చోటు చేసుకుంది.
నిర్మల్: తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. ఆరు నెలల చిన్నారిని ఓ కుక్క లాక్కెళ్లడంతో అక్కడికి అక్కడే మృతి చెందిన విషాధ సంఘటన చోటు చేసుకుంది.
ఈ సంఘటన నిర్మల్ జిల్లా దివలావర్‌పూర్ మండలంలోని సిర్గాపూర్‌లో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తమ ఆరు నెలల చిన్నారిని బస్టాప్‌లో పడుకోబెట్టారు.

వారు పక్కనే ఉన్న టీ దుకాణంలో చాయ తాగేందుకు వెళ్లారు. అంతలోనే కుక్క వచ్చి ఆ బాబును నోటకరిచి లాక్కెళ్లింది. దీంతో ఆ పసిపాప మృతి చెందాడు. తన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.












Click it and Unblock the Notifications