నిమజ్జనంలో అపశృతి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఇలా(ఫోటోలు)
హైదరాబాద్: గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఫిలింనగర్ దుర్గాభవానీనగర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడుని నిర్వాహకులు ట్రక్కులో శనివారం నిమజ్జనానికి హుస్సేన్ సాగర్‌కు తీసుకువచ్చారు. నిమజ్జనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం అవుతుండగా నెక్లెస్ రోడ్డులో ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.
ఈ ఘటనలో డ్రైవర్ రాముడు, బస్తీవాసులు సంతోషి, సతీష్, శివ, సత్యతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిని తరలించారు. రాంగోపాల్ పేట పోలీసు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిమజ్జనంలో అపశృతి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఇలా
ఇక ఖైరతాబాద్‌లో కొలువైన త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగించేందుకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నిమజ్జనంలో అపశృతి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఇలా
ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నాం 12 గంటల వరకు మాత్రమే దర్శనానికి ప్రజలను అనుమతిస్తారు. ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో మహాగణపతి చేతిలో ఉన్న 6 వేల కిలోల లడ్డూను కిందకు దింపి భద్రపరుస్తారు. ఈ నెల 30వ తేదీన లడ్డూను భక్తులకు పంచుతారు.

నిమజ్జనంలో అపశృతి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఇలా
మహా గణపతి విగ్రహాన్ని నిలిపివుంచిన మెటల్ బీమ్స్‌ను వెల్డింగ్‌తో తొలగించిన తర్వాత ఈరోజు రాత్రి 8 గంటలలోపు విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు. సాయంత్రం 5 గంటల కెల్లా మహా నిమజ్జనం ప్రారంభమవుతుందని పోలీసులు తెలిపారు.

నిమజ్జనంలో అపశృతి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఇలా
ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ముందు నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కనీసం 1000 విగ్రహాలు నిమజ్జనం చేయించడం ద్వారా ట్రాఫిక్‌ను కొంత మేర క్లియర్ చేయాలనేది పోలీసుల ఆలోచన. సోమవారం ఉదయం నాలుగో క్రేన్‌తో మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించారు.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications