లాంగ్ డ్రైవ్ కు వస్తావా అంటూ ఓ యువతికి 76 ఏళ్ళ వృద్దుడి వేధింపులు

మనమరాలి వయస్సున్న ఓ యువతిని తనతో లాంగ్ డ్రైవ్ కు రావాలని ఓ వృద్దుడు వేధించాడు. అయితే ఈ వేధింపులు భరించలేక ఆ యువతి షీటీమ్స్ ను ఆశ్రయించింది. పోలీసులు ఆ వృద్దుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చో

హైద్రాబాద్: మనమరాలి వయస్సున్న ఓ యువతిని తనతో లాంగ్ డ్రైవ్ కు రావాలని ఓ వృద్దుడు వేధించాడు. అయితే ఈ వేధింపులు భరించలేక ఆ యువతి షీటీమ్స్ ను ఆశ్రయించింది. పోలీసులు ఆ వృద్దుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైద్రాబాద్ లోని కుషాయిగూడలోని సాయిబాబా గుడికి తన తాతతో కలిసి ఓ యువతి వెళ్ళింది అయితే అనారోగ్యంతో గుడిలోనే ఆమె తాతయ్య కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన వినోద్ దేవాన్ అనే మరో వృద్దుడు వారికి సహయం చేశాడు.

తన బైక్ పై ఆ యువతి తాతను వారి ఇంటి దగ్గర వదిలివెళ్ళాడు. ఆ సమయంలోనే ఆ యువతి ఫోన్ నెంబర్ ను తీసుకొన్నాడు. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి ఆ యువతితో మాట్లాడాడు.

76 year old man arrested for sexually harassement

అయితే తన తాతకు సహయం చేసినందుకు వినోద్ దేవాన్ ను కూడ తాతయ్యలా భావించి ఆమె కూడ మర్యాదగానే మాట్లాడింది. అమ్మాయి మాటలు కలపడంతో కూడ మర్చిపోయిన దేవాన్ లాంగ్ డ్రైవ్ కు వెళదాం వస్తావా అంటూ ఆ అమ్మాయిని అడిగాడు.

అయితే ఈ మాటలకు షాక్ అయిన ఆ యువతి ఫోన్ కట్ చేసింది. అయినా ఆ వృద్దుడు పదే పదే ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో ఆ యువతి షీ టీమ్స్ ను ఆశ్రయించింది. కుషాయిగూడ ఎఎస్ఐ మల్లేష్ యాదవ్ వెంటనే స్పందించి కుషాయిగూడ సైనిక్ పురిలోని లేక్ వేవ్ రెసిడెన్సీలో ఉంటున్న వినోద్ ను అదుపులోకి తీసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+