స్కూల్లో బాలికపై బస్సు క్లీనర్ రేప్‌యత్నం(పిక్చర్స్)
హైదరాబాద్: ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలిక(9)పై అదే పాఠశాలకు చెందిన బస్సు క్లీనర్ శుక్రవారం అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కెపిహెచ్‌బి కాలనీ మూడో ఫేజ్‌లోని భాష్యం లిటిల్ ఛాంప్ స్కూల్‌లో బాలిక నాలుగో తరగతి చదువుతోంది. స్కూల్ బస్సు క్లీనర్ గణేష్(27) కొన్ని రోజులుగా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
శుక్రవారం ఉదయం స్కూల్‌కు వచ్చిన బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక భయంతో బయటకు పరుగులు తీసింది. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించకపోవడంతో బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది.
స్కూల్‌కు వచ్చిన బాలిక తల్లిదండ్రులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వివిధ సంఘాల నేతలు యాజమాన్యంపై ఆగ్రహం చేశారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన గణేష్‌కి దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుడ్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
వ్యభిచార ముఠా అరెస్ట్
నగరంలోని ఆదయ్యనగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన రేష్మా కటాన్(30) రఫీక్(25), షేక్ నజీర్(26)తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. అదే ప్రాంతం నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడు. శుక్రవారం దాడులు నిర్వహించిన పోలీసులు నలుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ముగ్గురు యువతులను జువైనల్ హోంకు తరలించారు.

నిందితుడు గణేష్
ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలిక(9)పై అదే పాఠశాలకు చెందిన బస్సు క్లీనర్ శుక్రవారం అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

పాఠశాల వద్ద ఆందోళన
కెపిహెచ్‌బి కాలనీ మూడో ఫేజ్‌లోని భాష్యం లిటిల్ ఛాంప్ స్కూల్‌లో బాలిక నాలుగో తరగతి చదువుతోంది. స్కూల్ బస్సు క్లీనర్ గణేష్(27) కొన్ని రోజులుగా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

అరెస్ట్
శుక్రవారం ఉదయం స్కూల్‌కు వచ్చిన బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక భయంతో బయటకు పరుగులు తీసింది.

నిందితుడు గణేష్
స్కూల్‌కు వచ్చిన బాలిక తల్లిదండ్రులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వివిధ సంఘాల నేతలు యాజమాన్యంపై ఆగ్రహం చేశారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన గణేష్‌కి దేహశుద్ధి చేశారు.












Click it and Unblock the Notifications