రిన్ కెరీర్ రెడీ అకాడమీలో నటి కేథరిన్ సందడి(ఫొటోలు)
హైదరాబాద్: నగరంలో దక్షిణాది సినీ నటి కేథరిన్ థెరిస్సా సందడి చేశారు. బుధవారం హోటల్ తాజ్‌కృష్ణలో రిన్ కెరీర్ రెడీ అకాడమి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి కేథరిన్ మాట్లాడుతూ.. అవకాశాలకు దూరంగా ఉన్న యువతకు ప్రయోజనం కలిగించే మంచి కార్యక్రమాన్ని రిన్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
కోర్ ఫాబ్రిక్ వాష్ కేటగిరీ హెడ్ విపుల్ మాథూర్ మాట్లాడుతూ.. కేవలం ఒక్క మిస్డ్ కాల్‌తో స్పోకెన్ ఇంగ్లిష్, ఆఫీస్ డ్రెస్సింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకునే అవకాశం రిన్ కేరీర్ అకాడమీ అందిస్తోందని తెలిపారు.

ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి 2లక్షలమందికి పైగా రిజిస్టర్ అయ్యారని చెప్పారు. ఇప్పటికే 8వేల మందికిపైగా ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసి, రిన్, బ్రిటీష్ కౌన్సిల్ నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తే ఉపాధి, విద్యా అవకాశాలను సొంతం చేసుకోవచ్చన్నారు.












Click it and Unblock the Notifications