Phone Tapping: మాజీ మంత్రి హరీశ్ రావు షాక్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు అయింది. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఈ మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హరీశ్ రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కూడా ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హరీశ్ రావు, రాధ కిషన్ రావు ఆదేశాలతో తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతే కాదు తనపై అక్రమం కేసులు పెట్టి వేధించారని చెప్పారు. తన కుటుంబ సభ్యులను బెదిరింంచారని వివరించాడు. అందుకే వారిపై చర్య తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హరీశ్‌రావు, రాధాకిషన్‌ రావుపై 120 (B), 386, 409, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వం భారీ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు.

A case has been registered against former minister Harish Rao at Panjagutta police station

అయన అక్కడే గ్రీన్ కార్డు కూడా పొందాడు. దీంతో ఈ కేసు విచారణ క్లిష్టంగా మారింది. ప్రభాకర్ రావు , శ్రవణ్ రావుకు విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది. పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలన్నారు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఇండియన్ ఎంబసీల ముందు హాజరుకావాలని స్పష్టం చేశారు. వారు ఇచ్చే వివరణ బట్టి పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథా రిటీ నిర్ణయం ప్రకటిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎప్పటికి ముగుస్తుందో క్లారిటీ లేదు. ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+