అసూయ, కోపం: చిన్నారిని కడతేర్చిన చిన్నమ్మ
హైదరాబాద్: నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారిని ప్రాణాలను సొంత చిన్నమ్మే కడతేర్చింది. 8 నెలల గర్భాన్ని కోల్పోయిన ఆమె తోటి కోడలు కూతుర్ని చూసి ఓర్వలేక నీటి డమ్ములో ముంచి ప్రాణాలు తీసింది.
ఘటనపై సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి, నిందితురాలిని అరెస్ట్ చేశారు. మంగళవారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఏడాదిన్నర వయస్సుగల జ్యోతిష మృతి చెందిన విషయం తెలిసిందే.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. ఈ మేరకు వివరాలను డిఐ వాసు వివరాలను వెల్లడించారు. మృతురాలు జ్యోతిష చిన్నమ్మ కె. పార్వతి అలియాస్ రాజ్యలక్ష్మి(21) నాలుగు నెలల క్రితం 8 నెలల గర్భాన్ని కోల్పోయింది. దీంతో నీకు ఇక పిల్లలు కారంటూ కుటుంబసభ్యులు హేళన చేయడంతోతోపాటు తన బావ బాలరాజు, తోటి కోడలు రేణుకల కూతురు జ్యోతిషను గారాబం చేయడం నిందితురాలికి నచ్చలేదు.
ఈ నేపథ్యంలో వారిపై కోపం పెంచుకున్న పార్వతి పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో రేణుక స్నానానికి వెళ్లగా, నిద్రిస్తున్న జ్యోతిషను పెరట్లో ఉన్న నీటి డ్రమ్ములో వేసి, పైన మూతపెట్టింది. దీంతో ఊపిరాడక, నీటిలో మునిగి జ్యోతిష మృతి చెందింది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చి పార్వతిని ప్రశ్నించగా, నేరం అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications