హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొదటి భార్యకు తెలియకుండా రెండోపెళ్లి: కానిస్టేబుల్‌ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాధ్యతాయుతమైన పోలీసులు విభాగంలో పనిచేస్తూ మొదటి భార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి చోటు చేసుకుంది.

వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన రాజేంద్రం(56) అదే మండలానికి చెందిన రమాదేవిని 30 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజేంద్రం వరంగల్‌ జిల్లా సుబేదారి మహిళా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

A constable arrested for illegal second marriage

రమాదేవికి తెలియకుండా రెండేళ్ల క్రితం మరో మహిళను వివాహం చేసుకొని హైదరాబాద్‌ పీర్జాదిగూడలో గుట్టుచప్పుడు కాకుండా కాపురం పెట్టాడు. హైదరాబాద్‌లో విధులు వేయించుకొని అధికశాతం ఇక్కడే ఉంటున్నాడు. ప్రస్తుతం అసెంబ్లీ బందోబస్తు విధుల్లో ఉన్న రాజేంద్రం.. రెండో భార్య దగ్గర ఉంటున్నాడు.

విషయం తెలుసుకున్న రమాదేవి ఆదివారం కుమారుడితో వచ్చి రాజేంద్రంను పట్టుకొని చితకబాదారు. వ్యవహారం బయటకు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని, రెండో భార్యను అదుపులోకి తీసుకున్నారు. రమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A constable arrested for illegal second marriage in Medchal district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X