ప్రేమజంటకు ఎస్‌ఐ పేరుతో కానిస్టేబుల్ వేధింపులు: అమ్మాయిల పట్ల అసభ్య ప్రవర్తన, అరెస్ట్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన ఆ వ్యక్తిని కర్ణాటకకు చెందిన నాఫూల్‌గా పోలీసులు గుర్తించారు. నాఫూల్‌ను రాష్ట్ర పోలీసులు కర్ణాటక పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.

A constable arrested for love couple harassment case

ప్రేమజంటకు ఎస్‌ఐ పేరుతో కానిస్టేబుల్ వేధింపులు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఎస్‌ఐ పేరుతో ఓ కానిస్టేబుల్ పలువురిని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుల్‌పై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఓ ప్రేమజంటను కూడా సదరు కానిస్టేబుల్ వేధింపులకు గురి చేసి డబ్బులు కాజేసినట్లు తెలిసింది. నిందితుడి కారణంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువకుడు బికారీగా మారినట్లు సమాచారం. ప్రేమజంటను వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్ తోపాటు ప్రసాద్ అనే అతడి స్నేహితుడు, మరొకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

రెండు బైక్‌లు ఢీ : విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా ములుగు మండలం కశిందేవిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+