లారీ బీభత్సం: ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు, వరంగల్ సీపీకి తప్పిన ప్రమాదం

మెదక్: వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ రవీందర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఓ లారీ వాహనాలను ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

A container accident at toopran toll gate: one died, 7 injured

మహారాష్ట్రలోని తమ బంధువు ఇంటిలో జరిగిన శుభాకార్యానికి వెళ్లి సీపీ అధికారిక వాహనంతో పాటు మరో కారులో వస్తుండగా.. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారిపై టోల్ గేట్ వద్ద ఆగివున్న కారును వెనుక నుంచి కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది.

A container accident at toopran toll gate: one died, 7 injured

ఈ వాహనంలో ప్రయాణిస్తున్న సీపీ బంధువు అనిత అక్కడికక్కడే చనిపోయారు. ఇదే కారులోని మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. కంటైనర్ లారీ దూసుకుపోవడంతో రెండు టోల్‌గేట్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇద్దరు టోల్ గేట్ సిబ్బంది గాయపడ్డారు.

A container accident at toopran toll gate: one died, 7 injured

ప్రమాద దాటికి ముందు ఉన్న సీపీ అధికారిక వహనం సైతం ధ్వంసమైంది. క్షతగాత్రులను హైదరాబాద్ యశోద, కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దేవుడి దయ వల్ల ఈ ప్రమాదం నుంచి తాను ప్రాణాలతో బయటపడ్డానని సీపీ విశ్వనాథ్ రవీందర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+