నడిరోడ్డుపై యువ జంట వీరంగం: కారు యజమాని, పోలీసులపై దాడి

హైదరాబాద్ నగరంలో ఓ యువ జంట శనివారం నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది. ‘యూ టర్న్‌’ తీసుకొనే విషయంలో జరిగిన గొడవతో.. కారు యజమానిపై, ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులపై దాడికి దిగారు.

హైదరాబాద్: నగరంలో ఓ యువ జంట శనివారం నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది. 'యూ టర్న్‌' తీసుకొనే విషయంలో జరిగిన గొడవతో.. కారు యజమానిపై, ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఈ జంటపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ హరివిహార్‌కాలనీకి చెందిన సురేందర్‌రెడ్డి తన కారులో వెళుతూ హిమాయత్‌నగర్‌ దగ్గర 'యూ టర్న్‌' తీసుకుంటున్నారు. అదే సమయంలో బాగ్‌లింగంపల్లికి చెందిన బలరామ్‌, గోల్నాకకు చెందిన హరిత అగర్వాల్‌ ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చి సురేందర్‌రెడ్డి కారుకి సమీపంగా దాటే ప్రయత్నం చేశారు.

couple attack

ఆ తర్వాత సురేందర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగి.. కారుపై దాడి చేశారు. అంతేగాక, 'మాకు అడ్డుచెబుతావా' అంటూ సురేందర్‌రెడ్డిని కారులోంచి బలవంతంగా బయటకులాగి కొట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నారాయణగూడ ఎస్సై సైదులు సంఘటన స్థలికి వెళ్లి ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో బందిస్తుండగా యువతి ఎస్సై చేతిలో ఫోన్‌ను లాక్కొని కిందకొట్టారు. మరో ట్రాఫిక్‌ హోంగార్డు ఫోనునూ అలానే చేశారు.

అంతటితో ఆగకుండా ఎస్సై సైదులుపై దాడికి యత్నించి, నెట్టివేశారు. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో రక్షక్‌ వాహనాన్ని పిలిపించి ఆ జంటను పోలీస్ స్టేషన్ తరలించారు. గాయపడ్డ సురేందర్‌రెడ్డిని, ఆ జంట మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికి ఆస్పత్రికి పంపించారు. బలరామ్‌, హరిత అగర్వాల్‌లపై ఐపీఎస్‌ 353, 341, 323, 504, ఆర్‌/డబ్ల్యూ34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+