యువతి ఫోటోలతో వీడియో చేసి వేధింపులు, పెళ్ళి చేసుకోకపోతే బయటపెడతానంటూ చివరకిలా..

ఓ డిగ్రి విధ్యార్థినిని ఓ ఆటోడ్రైవర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

జూబ్లిహిల్స్ : ఓ డిగ్రి విధ్యార్థినిని ఓ ఆటోడ్రైవర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలోని గౌతంనగర్ లో శ్రీనివాస్ నివాసం ఉంటున్నాడు. ఆయన ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్నాడు.అదే బస్తీలో డిగ్రీ చదువుతోన్న విధ్యార్థిని తన కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.

డిగ్రీ విధ్యార్థినికి ఆటోడ్రైవర్ కు గతంలో పరిచయం ఉండేది. ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కు వివాహమై ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. అయితే డిగ్రీ విధ్యార్థినితో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఆటో డ్రైవర్ శ్రీనివాస్ ఆ విధ్యార్థినిని వేధించేవాడు.

a degree student harassed by autodriver in banjarahills

గతంలో అతని వద్ద ఉన్న ఫోటోలను ఆ విధ్యార్థిని సెల్ ఫోన్ ను పంపేవాడు.తనను పెళ్ళిచేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. యువతికి వచ్చే పెళ్ళి సంబంధాలను చెడగొడుతున్నాడు.

రెండు రోజుల క్రితం మరోసారి ఆ యువతిని బెదిరించాడు. తన వద్ద ఉన్న ఫోటోలను వీడియోలుగా రూపొందించి పంపుతానంటూ ఆమెను బెదిరించాడు ఆటో డ్రైవర్ .

బాధితురాలి కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+