వైద్యం కోసం వస్తే.. మహిళా టెక్కీపై రేప్ యత్నం

హైదరాబాద్‌: అనారోగ్య కారణంగా వైద్యం కోసం వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై డాక్టర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విజయ్‌ భాస్కర్‌ అనే వైద్యుడు స్థానికంగా ఛాతి క్లీనిక్‌ నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి మారేడ్‌పల్లికి చెందిన ఓ ఐటీ ఉద్యోగిని (24)కి ఛాతినొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులతో కలిసి క్లీనిక్‌కు తీసుకువచ్చారు.

A doctor attempted rape a woman techie

వైద్యం చేసే సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేగాక, అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడని ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అతడితో గొడవకు దిగారు.

అనంతరం అతడి ప్రవర్తనపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+