రైలులోనే! మెగా అభిమానినంటూ మద్యం మత్తులో యువతి వీరంగం

తాను మెగాస్టార్ అభిమానినంటూ ఓ యువతి మద్యం మత్తులో రైల్లో వీరంగం సృష్టించింది.

హైదరాబాద్: తాను మెగాస్టార్ అభిమానినంటూ ఓ యువతి మద్యం మత్తులో రైల్లో వీరంగం సృష్టించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన గరీభ్‌రాథ్ రైలు స్లీపర్ క్లాస్‌లో ఎక్కిన ఈ యువతి ప్రయాణికులతోపాటు రైల్వే టీటీతో కూడా గొడవ పెట్టుకుంది.

అందరితోపాటు కాకుండా తనకు సెపరేట్‌గా సీటు ఇవ్వాలంటూ టీటీతో వాదనకు దిగింది. తనకు ఇక్కడ ఉన్న వెధవల మధ్య బర్త్ వద్దని సెపరేట్‌గా సీటు కేటాయించాలని వాదనకు దిగింది.

A drunk girl hulchul in a train

'మెగాస్టార్ అంటే ఈకట... ఆడికి చెప్పానంటే దూలతీర్చేస్తాడు. మెగాస్టార్ అంటే ఏమైనా ఈక ముక్కా..!' అని గోలచేస్తూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది పెట్టింది. వారు ఎంత సర్ది చెప్పినా వినకుండా నానా హంగామా చేసింది.

చదువు ఉందని గొప్ప అనుకోవద్దని, చిరంజీవి సినిమా చూశారో.. అని చిటికవేస్తూ.. చూడొద్దని మరో యువతికి వార్నింగ్ ఇచ్చింది. తన వల్ల ఇబ్బంది పడినవారు మనుషులే కాదంటూ వ్యాఖ్యానించింది. కాగా, ఈ తతంగమంతా ఓ తోటి ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+