ఉత్తుత్తి పోలీసులను చూసి ఠారెత్తిపోయిన మందుబాబులు: బైక్ లు వదిలి పరుగో..పరుగు!

హైదరాబాద్: సినిమా షూటింగ్ ను చూసి మందుబాబులు ఠారెత్తిపోయిన ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ లో భాగంగా..ఉత్తుత్తి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ను చూసి.. బేజారెత్తిపోయారు కొందరు మందుబాబులు, పోలీసుల చేతికి చిక్కకూడదనే ఉద్దేశంతో బైక్ లను అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. చివరికి- అసలు విషయం తెలుసుకుని కుదుటపడ్డారు. తమ అమాయకత్వానికి తామే నవ్వుకున్నారు. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మెహదీపట్నం సమీపంలోని షేక్ పేట్ నాలా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

సాధారణంగా వీకెండ్ రోజుల్లో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. అయినప్పటికీ- చుక్కపై మక్కువ తగ్గని మందుబాబులు అడ్వెంచర్లకు దిగుతుంటారు. మందు కొట్టి మరీ.. బైక్ లను నడిపించుకుంటూ ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. షేక్ పేట్ నాలా వద్ద కూడా శనివారం రాత్రి తెల్లరంగు షర్ట్, ఖాకీ ప్యాంటు ధరించి, పెద్ద ఎత్తున వాహనాలను మోహరింపజేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ను చేపట్టారు.

A Fake Drunk and drive threatened alcoholics in Hyderabad

అటు లింగంపల్లి నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను పెట్టి మరీ..బ్రీత్ ఎనలైజర్లను పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండటాన్ని చూసిన కొందరు మందుబాబులకు ఠారెత్తిపోయింది. నషాళానికి అంటిన నిషా స్పీడో మీటర్ లాగా కిందికి జారిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉండటాన్ని చూసి బిత్తరపోయారు. వెనక్కి వెళ్లే అవకాశం లేకపోవడంతో వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేసి, పరుగు లంకించుకున్నారు.

కొంత దూరం వెళ్లిన తరువాత వెనక్కి చూడగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ట్రాఫిక్ పోలీసులు యథాతథంగా తమ పని తాము చేసుకుంటూ పోవడం కనిపించింది. మధ్య మధ్యలో చేతులు కట్టుకుని మరీ సివిల్ డ్రెస్ లో ఉన్న వారితో మాట్లాడటాన్ని చూసిన మందుబాబుల్లో అనుమానం మొలకెత్తింది. అనుమానం వచ్చి పరిశీలించి చూడగా.. అదో ఉత్తుత్తి డ్రంక్ అండ్ డ్రైవ్ గా తేలింది. సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిజం తెలిసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+