వీడు తండ్రేనా?: 9నెలల కొడుకును ఆటోకేసి కొట్టాడు, వివాహేతర బంధం ప్రశ్నిస్తే..

Recommended Video

    9నెలల కొడుకును ఆటోకేసి కొట్టాడు, వివాహేతర బంధం ప్రశ్నిస్తే

    హైద‌రాబాద్: నగరంలోని జ‌గ‌ద్గిరిగుట్ట లెనిన్ న‌గ‌ర్‌లో దారుణం చోటుచేసుకుంది. 9 నెల‌ల బాబుని ఓ శాడిస్టు తండ్రి(శివ‌) చిత్ర హింస‌లు గురిచేశాడు. గత ఆదివారం అర్ధ‌రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన కొంత ఆలస్యంగా వెలుగుచూసింది.

    భార్య‌(అనూష)తో గొడ‌వ‌ప‌డి ఉన్మాదిలా వీరంగం సృష్టించాడు. 9 నెల‌ల బాబుని ఆటోకేసి కొట్టి పైశాచికంగాప్ర‌వ‌ర్తించాడు. ఆటోకేసి కొట్టడంతో కిందపడిన బాలుడు సొమ్మసిల్లిపోయాడు. ఆ తర్వాత బాలుడ్ని పట్టుకున్న తండ్రి శివ.. తల్లికివ్వకుండా ముప్పుతిప్పలు పెట్టాడు.

    A father throws a 9th months old son on a auto in lenin nagar

    అక్కడేవున్న పోలీసులు అతడ్ని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆ బాబును అతడ్నుంచి తీసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం బాబు క్షేమంగానే ఉన్నాడని తెలిపారు.

    కన్న తండ్రే బాబుపై ఇంత పైశాచికంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదని పోలీసులు చెప్పారు. కాగా, అనూషతో శివకు పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా, గత కొంత కాలంగా శివ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనూషను, బాబును పట్టించుకోవడం లేదు. దీనిపై అనూష నిలదీయడంతోనే ఆగ్రహానికి గురైన శివ.. కొడుకును చిత్రహింసలకు గురిచేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+