Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగిత్యాల స్కూల్ విద్యార్థినికి గర్భం...! వరసకు తాత అయిన రిటైర్డ్ ఉపాధ్యాయుడే కారణమని ఫిర్యాదు

పదిహేను సంవత్సరాల ఓ బాలిక గర్భవతి అయింది. అమ్మాయి కస్తుర్భా పాఠశాలలో పదవతరగతి చదువుతోంది. కాగా బాలిక ఇటివల తరచుగా అనారోగ్యానికి గురవడంతో హస్టల్లో ఉన్న బాలికను ఉపాధ్యాయులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాలికనుకు వివిధ పరీక్షలు జరిపిన వైద్యులు షాక్ తిన్నారు.. . బాలిక అప్పటికే నాలుగు నెలల గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడింది తనకు సమీప బంధువు తాతా వరుస వ్యక్తి అని తేలింది.

పదవ తరగతి బాలికపై రిటైర్డ్ ఉపాధ్యాయుడు అత్యాచారం

పదవ తరగతి బాలికపై రిటైర్డ్ ఉపాధ్యాయుడు అత్యాచారం

జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంలో నివసించే ఓ పదవతరగతి చదివే బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక జిల్లాలోని కస్తూర్భా పాఠాశాలలో గత సంవత్సరమే తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవులకు ఇంటికి చేరింది. దీంతో బాలికపై కన్నేసిన తన సమీపబంధువు, లోంగదీసుకుని పలుసార్లు లైంగిక చర్యలో పాల్గోన్నాడు. ఇక సెలవుల అనంతరం యథావిధిగా హస్టల్‌కు వెళ్లిన బాలిక ఇటివల తరచు అనారోగ్యానికి గురవుతుంది. దీంతో పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఇక అన్ని పరీక్షలు జరిపిన వైద్యులు అసలు విషయం తెల్చారు. బాలిక నాలుగు నెలల గర్భిణి అని చెప్పారు.. దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులను పిలిచి అమ్మాయిని అప్పగించారు.

కూతురు గర్భంపై షాక్ తిన్న తల్లిదండ్రులు

కూతురు గర్భంపై షాక్ తిన్న తల్లిదండ్రులు

ఇక కూతురు గర్భవతి అని విన్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.. ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీనికి కారణం సమీప బంధువు అని చెప్పింది. బాలిక గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తి రిటైర్ట్ ఉపాధ్యాయుడు కాగా, బాలిక తండ్రికి చిన్నాన్న అవుతాడు. ఈనేపథ్యంలోనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. అనంతరం సంఘటనకు కారణమైన వ్యక్తివద్దకు వెళ్లి తల్లిదండ్రులు నిలదీశారు. సామరస్యంగా విషయాంపై ఆరా తీయడంతో తనకు సంబంధం లేదని బుకాయించాడు. తనపై అనవసరపు అభాండాలను వేస్తున్నారని రివర్స్ గేర్ వేశాడు. అయినా... పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు కనీసం పోలీసులకు కూడ పిర్యాధు చేయలేదు.

గర్భానికి కారణమైన వ్యక్తే.. పోలీసులకు పిర్యాధు

గర్భానికి కారణమైన వ్యక్తే.. పోలీసులకు పిర్యాధు

దీంతో బాలిక తండ్రుల బలహినతను అసరా చేసుకున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోలీసులకు వద్దకు వెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల నుండి ప్రాణభయం ఉందని పిర్యాధు చేశాడు. దీంతో విచారణ కోసం బాలిక ఇంటికి వెళ్లిన పోలీసులకు తల్లిదండ్రులు విషయం తెలిపారు. ఇక ఇదే విషయంపై పెద్ద మనుష్యుల మధ్య కూడ మాట్లాడారు. కాని బాలిక గర్భానికి కారణమైన వ్యక్తి దిగిరాకపోవడంతో చివరికి తల్లిదండ్రులు శనివారం రాత్రి జగిత్యాల పట్టణ పోలీసు స్టేషన్‌లో పిర్యాధు చేశారు. సంఘటనపై పోలీసులు అధికారిక విచారణ ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+