చాక్లెట్ ఆశ చూపి బాలికపై రేప్: యువకుడి అరెస్ట్
మహబూబ్‌నగర్: మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాకొల్లాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్ పట్టణానికి చెందిన ఎండి బషీర్ అనే యువకుడు ఏడేళ్ల చిన్నారిని చాక్లెట్ కొనిస్తానంటూ బుధవారం సాయంత్రం శివాలయం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
యువకుడి వెంట చిన్నారి వెళ్తున్న విషయం గమనించిన స్థానిక మహిళ ఒకరు ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలికను ఎక్కడికెళ్లావని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌పై నిర్భయ, పోక్సో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు
హైదరాబాద్: అన్నపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబర్‌పేట ఆకాష్‌నగర్‌లో అర్షద్‌సయీద్, ఇఫ్తికర్ సయీద్, ఇంతియాజ్ సయీద్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో నివాసముంటున్నారు.
ఇఫ్తికర్ ఇంట్లో మేకలను పెంచుతున్నాడు. మేకలు పెంచడంతో దుర్వాసన వస్తోంది.. బయట కట్టేయాలని చాలా రోజులుగా అర్షద్ తన తమ్ముడు ఇఫ్తికర్‌కు చెబుతున్నాడు. గురువారం కూడా మరోసారి ఇదే విషయమై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇఫ్తికర్ ఇంట్లోకి వెళ్లి గడ్డికోసే కత్తిని తీసుకొచ్చి అర్షద్‌పై దాడి చేశాడు. దీంతో అతని చేతికి గాయాలయ్యాయి. వెంటనే అతను అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications