కిలేడీ చిక్కింది: పోలీసునంటూ ఫేస్‌బుక్‌లో పరిచయం, మోసాలు
సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతోంది ఓ యువతి. పోలీసునంటూ తప్పించుకు తిరుగుతోంది.ఈ క్రమంలో ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వరంగల్: సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతూ పోలీసునంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.25వేల నగదు, పోలీస్ యూనిఫాం, మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కేసముద్రం మండలానికి చెందిన ప్రత్యూష రెడ్డి అనే యువతి కొన్నేళ్లుగా పోలీసు నకిలీ గుర్తింపు కార్డును తయారుచేసుకొని ఫేస్‌బుక్‌లో ఫొటోలు ఉంచి పరిచయాలు పెంచుకుంది. దీనికి తోడు వరంగల్ పోలీస్ కమిషనరేట్, భూపాలపల్లి జిల్లాలకు చెందిన కానిస్టేబుల్‌గా రెండు పోలీసు గుర్తింపు కార్డులను తయారుచేసుకుంది.

ఫేస్‌బుక్‌లో పలువురిని పరిచయం చేసుకొన్న యువతి తన ఆరోగ్యం బాగాలేదని చెప్పి.. వారిని నమ్మించి డబ్బులు వసూలు చేసేదని సుబేదారి సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. తాజాగా దుబాయిలో ఉంటోన్న ఓ వ్యక్తి నుంచి రూ.70వేలు తీసుకుందని తెలిపారు. దీంతో బాధితుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితురాలిని అరెస్టు చేసినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications