వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురుకే గుండుగీయించారు

|
Google Oneindia TeluguNews

వరంగల్: అర్బన్ జిల్లాలోని హసన్‌పర్తి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంగా.. కన్నకూతురుపైనే అమానవీయంగా ప్రవర్తించి ఆమెకు గుండు గీయించారు తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హసన్‌పర్తి సీఐ కిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్‌, బాధిత యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. 2017 డిసెంబర్‌ 28న చిల్పూర్‌ దేవస్థానంలో వివాహం చేసుకున్నారు.

A girl attacked by her parents for love marriage

తమకు ఇష్టంలేకున్నా వివాహం చేసుకుందనే ఆగ్రహంతో ఉన్న యువతి తల్లిదండ్రులు, సోదరులు, వదినలు.. సోమవారం ప్రవీణ్‌ ఇంట్లో లేని సమయంలో వెళ్లి.. ఆ యువతిపై దాడి చేసి బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లారు.

దీంతో తన భార్యను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని సోమవారం సాయంత్రం ప్రవీణ్‌ హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు యువతిని బలవంతంగా తీసుకెళ్లడమే కాకుండా గుండు చేయించిన విషయం తెలియడంతో మంగళవారం యువతి తల్లిదండ్రులు, సోదరులు, వదినలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
A girl attacked by her parents for love marriage in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X