ప్రేమించి పెళ్లొద్దన్నాడు: యువతి ఆత్మహత్య
హైదరాబాద్: తను ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కానాజీగూడకు చెందిన అనిత(17), అల్వాల్‌లో బేకరీ నడుపుతున్న జగ్గు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని అనితతో చనువుగా తిరిగాడు జగ్గు. అయితే, ఆ తర్వాత మాటమార్చాడు.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత శుక్రవారం తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు.. అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనిత ఆత్మహత్యకు కారణమైన జగ్గును అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications