ఇంటి ముందు నిమ్మకాయలు, నల్లబొమ్మలు కనిపిస్తే ఆత్మహత్య చేసుకుంటారా..!
టెక్నాలజీ పరంగా మనం ఎత్త ఎత్తుకు ఎదిగినా కొందరు మూఢనమ్మకాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మూఢనమ్మకాలు ఎక్కడో ఏజెన్సీ ఏరియాల్లో కాదు ఏకంగా మన రాజధాని హైదరాబాద్ లోనే. పట్నంలోని కుల్సుంపురాలో 16 ఏళ్ల నవ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఆత్మహత్యకు క్షుద్రపూజలే కారణమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జూన్ 1 గురువారం ఆమావాస్య రోజున నవ్య బయటకు రాగ.. ఇంటి ముందు నిమ్మకాయలు, నల్లబొమ్మలు కనిపించాయి.
దీంతో నవ్య ఒక్కసారిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లారు. అయితే నవ్య అప్పటి నుంచి భయంతో వణికిపోతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. నవ్య పదే పదే నిమ్మకాయలు, నల్ల బొమ్మలు కనబడినట్లు తమకు చెప్పిందని వారు తెలిపారు. కళ్లు మూసినా తెరిచినా అదే గుర్తుకు వస్తుందని నవ్య ఏడుస్తూ చేప్పేదని పేర్కొన్నారు. నవ్య ఒంటరిగా ఎటు కూడా వెళ్లేది కాదని.. చిన్న అలికిడి వినిపించిన భయంతో వణికిపోయేదని తెలిపారు.

ఈ క్రమంలో బుధవారం రోజు కూడా వారి వాకిట్లో మరోసారి నిమ్మకాయలు, నల్లబొమ్మలు కనిపించాయి. ఇది చూసినా నవ్య మరోసారి తీవ్ర భయాందోళనకు గురైంది. నిమ్మకాయలు, నల్లమబొమ్మలు, కుంకుమ నవ్య స్వయంగా కాల్చిపడేసింది. నవ్య అక్క వంట చేస్తుండగా.. అప్పుడే షాప్ కు వెళ్లి నవ్యు కోడిగుడ్లి తీసుకొచ్చి అక్కకు ఇచ్చింది. తర్వాత ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
నవ్య రూమ్ లోకి వెళ్లి చూడగా.. నవ్య ఉరివేసుకుని కనిపించింది. వారు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నవ్య వాళ్లు ముగ్గులు సోదరిమణులు కాగా నవ్య రెండో కూతురు. నవ్య మరణంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
శ్రీకృష్ణుడి అవతారమంటూ కామక్రీడలు: భక్తి ముసుగులో బలత్కారం! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
బెట్టింగ్ యాప్‌లకు బిగ్ షాక్… 300 ప్లాట్‌ఫామ్‌లు బ్లాక్ చేసిన ప్రభుత్వం -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications