నగ్నచిత్రాలు పెడ్తానని బెదిరింపు: యువతి ఫిర్యాదు
హైదరాబాద్: ప్రేమ, సరదాల వరకు ఒకేనట. పెళ్లంటే మాత్రం పరువు తీస్తానని బెదిరింపులు. దీంతో ఆ యువకుడిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
గత కొంతకాలంగా బాధిత ఇంజినీరింగ్ విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడిపిన ఓ యువకుడు.. పెళ్లి చేసుకోమని అడిగితే ఫేస్‌బుక్‌లో నగ్న చిత్రాలు పెడతానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. షేక్‌పేటలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని(21) స్థానిక ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. ఇదే ప్రాంతంలో నివసించే శ్రీకాంత్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని సదరు విద్యార్థినిని లోబర్చుకున్నాడు.
ఇటీవల సదరు విద్యార్థి పెళ్లి చేసుకోవాలంటూ శ్రీకాంత్‌పై ఒత్తిడి తేగా.. ఆ యువతి చిత్రాల్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వాటిని ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications