నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ యువతి రచ్చ: వైరల్ వీడియోపై సజ్జనార్ ట్వీట్
సోషల్ మీడియా మోజులో పడిన నేటి యువతి.. వ్యూస్, లైక్స్ కోసం, సెలబ్రిటీ కావాలంటూ కలలు కంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. మరికొందరు కటకటాలపాలవుతున్నారు. తాజాగా ఓ యువతి రోడ్డు మధ్యలోకి వచ్చి డ్యాన్స్ చేస్తూ రచ్చ చేసింది. దీంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ వీడియోపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు.
నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి… pic.twitter.com/RQ6aGEWUet
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 24, 2023
ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను షేర్ చేసి ఇలాంటి యువత తీరుపై సీరియస్ అయ్యారు. 'నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్' యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏ ఆనందమో.. ఏమో' అని సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు.

కాగా, ఆ వీడియోలో.. వాహనాలు వెళ్తున్న రోడ్డు మధ్యలోకి ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్లి.. తన కాలేజీ బ్యాగ్‌ను రోడ్డుపై పడేసి నేలపై పడుకుని స్పెప్పులు వేస్తుంది. రోడ్డుపై సిగ్నల్ పడి ఆటోలు, బస్సులు ఆగడంతో కెమెరా వైపు చూస్తూ డ్యాన్స్ చేసింది. 23 సెకన్లపాటు ఉన్న ఈరీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో ఆ అమ్మాయి ప్రవర్తనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. గతంలో రోడ్డు స్నానాలు చేయడం, వాహనాలపై వెళుతూ వింత చేష్టలకు పాల్పడుతున్న వీడియోలు వెలుగులోకి రావడం తెలిసిందే.












Click it and Unblock the Notifications