ఫేస్‌బుక్ పరిచయం: కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి యువతిపై రేప్
హైదరాబాద్: సోషల్ మీడియా అయిన ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతికి కూల్ డ్రింకులో మత్తు కలిపి అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ టోలిచౌకి ఫ్రెండ్స్ కాలనీకి చెందిన విష్ణువర్ధన్ (28) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సమీప ప్రాంతంలో నివసిస్తున్న ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగినితో కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పరచుకున్నాడు.
ఫిబ్రవరి 2న రాత్రి ఆ మహిళను కారులో తన ఇంటికి తీసుకొచ్చాడు. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఆమె చేత తాగించి అనంతరం అత్యాచారం చేశాడు. మరుసటి రోజు బాధితురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్: రూ.33 లక్షలు స్వాధీనం
ఖమ్మం జిల్లా మధిరలో సీసీఎస్ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 33 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications