అన్నా! వదిలేయండని వేడుకున్నా రేప్: చిత్రీకరించి వీడియో పోస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆదిలాబాద్: ఓ గిరిజన యువతి ఇద్దరు కీచకులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. అన్నా వదిలేయండని వేడుకున్నా వినకుండా భయపెట్టి ఆమెపై అత్యాచారం చేసి, దృశ్యాలను చిత్రీకరించి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతంలో జరిగింది. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి అన్నా.. నన్ను వదిలేయండంటూ ఆ యువతి ఏడుస్తూ ఇద్దరు వ్యక్తులను వేడుకుంది. అయినా వారు వినలేదు. తెలుగు, గిరిజన భాషల్లో మాట్లాడుతున్న ఆ యువతి మరో వ్యక్తితో కలిసి పరిసర ప్రాంతాల్లో ఏకాంతంగా తిరుగుతుండడాన్ని ఇద్దరు వ్యక్తులు కనిపెట్టారు.

A girl raped and filmed posted in social media

వెంటనే జంటను వీడియో తీస్తూ మీ ఈ దృశ్యాలను నెట్ ద్వారా పోలీసులకు పంపిస్తామని, మీ భవిష్యత్తు నాశనం చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ యువతి ఏడుస్తూ అన్నా నన్ను వదిలి పెట్టండి, మీరనుకుంటున్నట్లు ఏమీ లేదని ప్రాధేయ పడింది. ఆ హృదయ విదారకమైన సంఘటన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

యువతిని భయభ్రాంతులకు గురి చేసి లోబరుచుకోవడమే కాకుండా అత్యాచారం చేసే దృశ్యాలను వీడియో తీశారు. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో సంఘటనను చిత్రీకరించే వ్యక్తి మొహం కనపించడం లేదని, అత్యాచారానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న వ్యక్తి స్థానికుడే నని పలువురు చెబుతున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

గిరిజన భాషలో మాట్లాడుతున్న బాధిత యువతి ఆమె వెంట ఉన్న యువకుడు ఎవరనేది ఇంకా తెలియడం లేదు. అయినప్పటికీ వీరిద్దరు ఆసిఫాబాద్ లేదా తిర్యాణి మండలాలకు చెందిన వారై ఉంటారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించగా బాధితురాలు ఎవరో తెలియడం లేదని, ఒకవేళ ఫిర్యాదు వస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl has been raped by two persons in Adilabad district of Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X