వెంబడించి మరి.. అడవిలోకి తీసుకెళ్లి భర్తను చంపిన భార్య !

ఇంట్లోనే భార్యపిల్లలను వదిలి నిప్పుపెట్టి వెళ్లిన ప్రభుత్వ టీచర్ పై ఆయన భార్య పిల్లలు కక్ష తీర్చుకున్నారు. తమని చంపాలని చూసిన వ్యక్తిని ఆయన కుటుంభ సభ్యులే వెంబడించి అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆటోలో కట్టేసి పెట్రోల్ పోసి కాల్చి చంపారు.అనంతరం పోలీసులుకు లొంగిపోయారు.

కొమరం భీం జిల్లా ప్రభుత్వ టీచర్ దారుణ హత్య

కొమరం భీం జిల్లా ప్రభుత్వ టీచర్ దారుణ హత్య

కోమురం భీం జిల్లా జైనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర నారయణ ,యమునాభాయ్ దంపతులకు ముగ్గురు సంతానం. నారయణ ప్రభుత్వ టీచర్ గా చేస్తున్నాడు, అయితే పిల్లలకు సంబంధించి ఇంట్లో ఘర్షన నెలకోంది. పిల్లల ప్రయోజనం గురించి భార్యభర్తల మధ్య మాటమాట పెరగడంతో మధ్య గొడవ జరిగింది.దీంతో విచక్షణ కోల్పోయిన నారయణ ఇంట్లో ఉన్న బట్టలకు నిప్పు పెట్టి పారిపోయాడు అయితే ఆ మంటు ఇళ్లుకు అంటుకున్నాయి. దీంతో అప్రత్తమైన భార్య పిల్లలు బయటకు రాగా చుట్టుపక్కల వాళ్లు ఇంటి మంటలను ఆర్పివేశారు. భార్య పిల్లలను ఆసుపత్రికి తరలించారు.

నాలుగురోజుల తర్వాత ఉపాధ్యాయుడిపై కక్ష తీర్చుకున్న కుటుంభసభ్యులు

నాలుగురోజుల తర్వాత ఉపాధ్యాయుడిపై కక్ష తీర్చుకున్న కుటుంభసభ్యులు

ఇంటికి నిప్పుపెట్టి భార్య ,పిల్లల్ని చంపాలని చూసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నారయణపై కక్ష పెంచుకున్నారు ఆయన కుటుంభ సభ్యులు. దీంతో ఆయనను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలో నారయణ కోసం వెతికారు. ఇంటికి నిప్పుపెట్టి పారిపోయిన నారయణ ,ఆదిలాబాద్ జిల్లాలోని తన బంధువు ఇంట్లో తలదాచుకున్నాడు. దీంతో విషయం తెలుసుకు కుటుంభ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుండి కూడ నారయణ పారిపోవడంతో కుటుంభ సభ్యులు వెంబడించారు.

ఆటోలో కట్టేసి కాల్చి వేసిన కుటుంభ సభ్యులు

ఆటోలో కట్టేసి కాల్చి వేసిన కుటుంభ సభ్యులు

అయితే పారిపోతున్న నారయణను వెంబడించిన కుటుంభ సభ్యులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అయన్ను ఓ ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. ఆటోలోనే ఓ అటవీప్రాంతానికి తీసుకెళ్లిన అనంతరం నారయణను కదలకుండా ఆటోలోనే కట్టివేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపివేశారు. అనంతరం వారు జైనూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు వచ్చి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+