‘తెల్లచీర..మల్లెపూలతో భలే ఉంటావ్’: రక్షణ కోసం వస్తే వివాహితతో హోంగార్డు అసభ్యం
హైదరాబాద్: రక్షణ కల్పిస్తాడనే నమ్మకంతో ఆశ్రయిస్తే.. ఓ వివాహిత పట్ల కామంతో ప్రవర్తించాడో హోంగార్డు. 'తెల్ల చీరలో.. మల్లెపూలతో నువ్వు భలే ఉంటావ్!' అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాగుడుకు బానిసైన భర్త వేధింపుల నుంచి రక్షణ కోరితే.. ఆమెకు ఆ పోలీసు నుంచే వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆ హోంగార్డును స్థానికులు చితకబాది తగిన బుద్ధి చెప్పారు.
ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌లోని దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన వివాహిత(38) ఇంట్లో భర్తతో ఉన్న గొడవల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సమీపంలో ఉన్న ఫిలింనగర్ ఔట్‌పోస్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలోనే అక్కడ విధులు నిిర్వహిస్తున్న హోంగార్డు సురేష్ బాధితురాలి సమస్య తీరుస్తానంటూ నమ్మించాడు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటికి వెళ్లి ఆమె ముందే ఆమె భర్తను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా బాధితురాలికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేశాడు.

లిఖితపూర్వంగా ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న నెంబరు ద్వారా ఆమెకు ఫోన్ చేసేవాడు. అంతేగాక, 'నీకు మేలు చేసిన నాకేమిస్తావ్'అని వేధించటం మొదలుపెట్టాడు. నాలుదైదు రోజులుగా ఇంటికి కూడా వచ్చి ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం బాధితురాలికి ఫోన్ చేసిన సురేష్.. తాను ఆమె ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు.
ఆమె హోంగార్డు మాటలను రికార్డు చేసి విషయం ఇంట్లోని వారికి, బంధువులకు చెప్పింది. దీన్‌దయాళ్‌నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన సురేష్‌ను స్థానికులు చుట్టుముట్టారు. అతన్ని చితకబాదారు. చివరకు తప్పు జరిగిందని తనను క్షమించాలని హోంగార్డు స్థానికుల కాళ్ల మీద పడ్డాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా సెల్‌ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ తనను హింసిస్తున్నాడని, తనపై అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడంటూ సురేష్‌పై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సురేష్‌పై ఐపీసీ సెక్షన్ 354(డి) నిర్భయ కేసు నమోదు చేశారు. తప్పు తేలితే ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications