ఆపుకోలేకపోయాడు.. రోడ్డు పక్కనే పనికానిచ్చేసిన పోలీస్

హైదరాబాద్ : స్వచ్చ భారత్ లాంటి పతకాలు సామాన్య జనం ఆచరించాలంటే.. దిశా నిర్దేశం చేసే అధికారులు ముందు దాన్ని పాటించాలి. అలా కాకుండా.. మాకు మాత్రం మినహాయింపు అన్న తరహాలో అధికారులు వ్యవహరిస్తే.. ఇక సామాన్య జనం మాత్రం ఏం పాటిస్తారు!

A hyderabadi cop Urinated publicly

ఆపుకోలేకపోయాడో.. లేక ఎక్కడైతే ఏంటి పనికానిచ్చేయడానికి అనుకున్నాడో గానీ ఓ తెలంగాణ పోలీసాయన.. రోడ్డు పక్కనే బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. పోలీస్ వాహానాన్ని పక్కనే నిలిపి రోడ్డు పక్కన ఆయన మూత్ర విసర్జన చేస్తుండగా.. ఎవరో 'క్లిక్' మనిపించారు. దీంతో ఆ ఫోటో కాస్త ఇంటర్నెట్ లోకి ఎక్కి వైరల్ గా మారిపోయింది.

అయితే ఆ ఫోటోపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయ్ లెట్స్ ను వినియోగించుకోకుండా, ఇలా పబ్లిక్ గా మూత్ర విసర్జన చేయడంపై కొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. మరికొంతమందేమో.. అసలా టాయ్ లెట్స్ పరిశుభ్రంగా ఉంటే ఆయన మాత్రం ఎందుకలా పబ్లిక్ గా మూత్ర విసర్జన చేస్తారంటూ? ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+