కోరికతీర్చకపోతే ఇంట్లోనుండి వెళ్ళిపో, కోడలిపై మామా లైంగిక వేధింపులు

తండ్రిలా కాపాడాల్సిన మామే .... కోడలిపై కన్నేశాడు. కొడుకు మద్యానికి బానిసగా మారడంతో ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని ఆయన కోడలిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు.

హైదరాబాద్: తండ్రిలా కాపాడాల్సిన మామే .... కోడలిపై కన్నేశాడు. కొడుకు మద్యానికి బానిసగా మారడంతో ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని ఆయన కోడలిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.అయితే విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

హైద్రాబాద్ చాధర్ ఘాట్ లో ఆజంపుర మర్కస్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. భార్య ఇటీవలే మరణించింది. రెండో కొడుకు భార్య, ముగ్గురుపిల్లలతో పాటు మామ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూలీ పనిచేసే రెండో కొడుకు తాగుడుకు బానిసగా మారాడు.

రోజూ కూలీపనిచేసి వచ్చిన డబ్బులతో మద్యం సేవించడమే ఆయనకు అలవాటుగా మారింది. ఇతని భార్య జిహెచ్ ఎం సీలో స్వీపర్ గా పనిచేస్తోంది. ఆమె మామ కామాటీ పనిచేస్తున్నాడు. అయితే తన కొడుకు తాగుడుకు బానిసగా మారడంతో ఈ కోడలిపై ఆయన కన్నేశాడు.

A lady suicide attempt for sexual harassment in Hyderabad

కోడలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను మామ లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడు. ఇందుకు అంగీకరించకోపతే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని బెదిరించేవాడు. తాగుబోతు భర్తకు చెప్పుకోలేక శనివారం సాయంత్రం ఆమె ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.వెంటనే కుటుంబీకులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పోలీసులు విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది. ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. బాధితురాలి నుండి వాంగ్మూలం సేకరించిన పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+