వివాహిత ఆత్మహత్య, పక్కింటి మహిళ భర్తతో ఇలా....

భర్త వేధింపులతో పాటు ,పక్కింటి మహిళ కూడ వేధింపులను భరించలేక ఓ వివాహిత బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైదరాబాద్:భర్త వేధింపులు , తోటి మహిళ సాధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.పక్కింటి మహిళ కూడ వివాహిత ఆత్మహత్యకు కారణమైందని స్థానికులు చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన శివంగి నాగవేణి, ఆనంద్ దంపతులు. పదకొండేళ్ళ క్రితం వీరికి వివాహమైంది.వీరికి ఇద్దరు ఆడపిల్లలు.ఆనంద్ వెల్డర్ గా పనిచేస్తున్నాడు.

షాపూర్ నగర్ సంజయ్ గాంధీ నగర్ లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వీరి ఇంటి పక్కనే శ్రీసాయి మహిళా మండలి అధ్యక్షురాలు యాదమ్మ కూడ నివసిస్తోంది.

a lady suicide for harassment of husband

కొద్ది రోజుల క్రితం యాదమ్మ, నాగవేణిలు గొడవపడ్డారు. దీంతో అదికాస్తా క్రమేణా వివాదంగా మారింది.ప్రతి రోజూ ఇద్దరూ గొడవపడేవారు. నిత్యం వీరిద్దరూ కూడ గొడవపడేవారు.అయితే స్థానికులు కూడ వీరిద్దరి గొడవను చాల లైట్ గా తీసుకొనేవారు.

నాగవేణి కదలికలను ఎప్పటికప్పుడు భర్తకు యాదమ్మ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేది. నాగవేణి మీద అనుమానం వచ్చేలా యాదమ్మ నాగవేణిపై ఆమె భర్తకు చెప్పేదని స్థానికులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో నాగవేణికి ఆమె భర్త నుండి యాదమ్మ నుండి వేధింపులు ఎక్కువయ్యాయి. రెండు రోజుల క్రితం యాదమ్మ నాగవేణిని నీళ్ళు పట్టుకొనే విషయంలో గొడవ జరిగింది. నాగవేణిని యాదమ్మ చులకనగా మాట్లాడింది.

దీంతో మనోవేదనకు గురైన నాగవేణి బుదవారం ఉదయం ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సమాచారం అందుకొన్న పోలీసులు మృతదేహన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+