హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ప్రేమజంటపై దాడి: సోషల్ మీడియాలో హల్‌చల్(వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలో ఓ ప్రేమ జంటపై కొందరు ఆకతాయిలు దాడి చేశారు. సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన ప్రేమజంటపై దాడి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

నగరంలోని రామకృష్ణ థియేటర్‌లో సినిమాకు వెళ్లిన జంటపై ఈ దాడి జరిగింది. గతంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో కొన్ని చోట్ల జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, అప్పుడు మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించి చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Video Courtesy: ABN Telugu

కొంత వరకు కట్టడి చేశామని, ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి వీడియో అందజేస్తే, ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సీసీ కెమెరాను పరిశీలించి, దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారులు చెప్పారు.

కాగా, ఓ న్యూస్ ఛానెల్‌లో ఈ వీడియో ప్రచారం కావడంతో విషయం బహిర్గతమైంది. ఆ వీడియోను సదరు మీడియా సంస్థ సెంట్రల్‌ జోన్‌ పోలీస్‌ అధికారికి అందజేసినట్లు సమాచారం. ప్రేమ జంటపై జరిగిన దాడిపై సీసీ పూటేజీ కెమెరాలను పరిశీలించి పోకిరీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

English summary
A love couple allegedly attacked in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X