Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెద్దలు అంగీకరించలేదని హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట: కాపాడారు

హైదరాబాద్: తమ ప్రేమను అంగీకరించని పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించింది. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ ప్రేమజంటను అక్కడేవున్న పోలీసులు కాపాడారు.

ఆ ప్రేమజంటను వినోద్, కుమారీలుగా పోలీసులు గుర్తించారు. ప్రేమికుల తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

హైదరాబాద్ నగరంలోని కంచన్‌బాగ్, చైతన్యపురిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కంచన్‌బాగ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 5 తులాల బంగారం దోచుకెళ్లారు.

A love couple attempted to commit suicide in Hyderabad

మరో ఘటనలో చైతన్యపురి యాదవ్‌నగర్ కాలనీలో రాధ(63) అనే మహిళ మెడలో నుంచి 4 తులాల మంగళ సూత్రాన్ని అపహరించారు. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బైక్ చోరీల గ్యాంగ్ అరెస్ట్

వాహనాలు ఎత్తుకెళ్లే ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు దొంగల నుంచి 13 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఇంకా ఇలాంటి దొంగల ముఠాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+