తొమ్మిదో తరగతి మైనర్ల ప్రేమకథ: పెద్దల మందలింపు.. ఆపై షాకింగ్ నిర్ణయం!!
తెలిసీ తెలియని వయసులో ఇద్దరు చిన్నారుల మధ్య చిగురించిన ప్రేమ వారు షాకింగ్ నిర్ణయం తీసుకునే దాకా వెళ్ళింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ల లవ్ పెద్దలకు తెలియడంతో మందలించారు. తమ ప్రేమను పెద్దలు నిరాకరిస్తున్నారని ఏకంగా ఆ మైనర్ల జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే ప్రస్తుతం పిల్లల ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే

మైనర్ల ప్రేమ.. మందలించిన తల్లిదండ్రులు
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు ప్రేమలో పడ్డారు. సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో తెలియదు కానీ గట్టిగానే ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న ఈ మైనర్ల జంట వ్యవహారం ఇంట్లో పెద్దవాళ్లకు తెలియడంతో అలాంటి పనులు చేయకూడదని మందలించారు. ఇద్దరు ఒకరిని ఒకరు కలవకూడదని చెప్పారు. అయినప్పటికీ మాట వినక పోవడంతో అమ్మాయిని స్కూల్ కు పంపకుండా ఇంటివద్ద ఉంచారు తల్లిదండ్రులు.

ఫాక్స్ సాగర్ చెరువులో దూకిన ఇద్దరు విద్యార్థులు
ఈ క్రమంలో తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చే వంకతో బయటకు వెళ్లిన విద్యార్థిని ఆ బాక్సుతో నేరుగా సదరు మైనర్ లవర్ వద్దకు వెళ్లింది. ఆపై వారిద్దరూ వేరే విద్యార్థి ఇంట్లో బ్యాగ్ పెట్టేసి సైకిల్ పై వెళ్ళిపోయారు. భోజనం బాక్స్ ఇస్తానని వెళ్ళిన బాలిక ఇంటికి రాలేదు. ఇక అబ్బాయి కూడా కన్పించకుండా పోయాడు. ఇక వారిరువురూ ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారు ఫాక్స్ సాగర్ చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించారు. ఇద్దరు ఫాక్స్ సాగర్ చెరువులో దూకినట్టు గుర్తించారు.

14 ఏళ్ళ వయసులో ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న మైనర్లు
దీంతో ముందుగా విద్యార్థిని మృతదేహం లభించగా శుక్రవారం ఉదయం విద్యార్థి మృతదేహం లభించింది. హైదరాబాద్ లో పేట్ బషీరాబాద్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ప్రేమించుకున్న ఇద్దరు మైనర్లు ప్రాణాలు వదిలారు. 14 ఏళ్ళ వయసులో ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారు. ఫాక్స్ సాగర్ చెరువులోకి దూకి ఇద్దరు మైనర్లు సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఊహించని విధంగా మైనర్ల ప్రేమకథ విషాదాంతమైంది. విద్యార్థుల కుటుంబాలు ఈ ఘటనతో శోక సంద్రంలో మునిగిపోయారు.
Recommended Video


తెలిసీ తెలియని వయసులో ప్రేమ.. ఆపై షాకింగ్ నిర్ణయ.. సినిమాల ఎఫెక్ట్
తెలిసీ తెలియని వయసులో ప్రేమించుకున్న ఇరువురు మైనర్లు, ఆ ప్రేమను సీరియస్ గా తీసుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నారు. ప్రేమకు అర్థం తెలియని వయసులో, ప్రేమ పేరుతో చిన్నారులు ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక సినిమాలలో మైనర్ల మధ్య ప్రేమ కూడా మైనర్ లు ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవటానికి కారణంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇళ్ళల్లో తల్లిదండ్రులు చిన్నారుల ప్రవర్తనను, మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications