హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలికపై అత్యాచార యత్నం: మజ్లీస్ నేత అరెస్ట్, పోక్సో చట్టం కింద కేసు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఓ రాజకీయ నాయకుడిని స్థానికులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల బాలికపై జాంబాగ్‌కు చెందిన మజ్లీస్ నేత రఫిక్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

పటేల్‌నగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో ఉండే రఫిక్.. బాలికను భయపెట్టి తన ఇంట్లోనే లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబసభ్యులకు బాలిక విషయం తెలపడంతో రిఫిక్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు రఫిక్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన బేగంబజార్ పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. కాగా, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రఫిక్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు.

A majlis leader arrested in a Rape attemp on minor girl case

భర్త వేధింపులు తాళలేక వైద్యురాలి ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు భర్తను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దామరచర్లవాసి గంగనపల్లి కాశీ విశ్వనాథం కుమార్తె డాక్టర్ స్వప్న (38) తొలి వివాహం మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో అయింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పీహెచ్‌సీలో పనిచేస్తున్న క్రమంలో అనివార్య కారణాలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

అనంతరం కర్నూలుకు చెందిన డాక్టర్‌ ఎం శ్రీధర్‌తో 2015 ఏప్రిల్‌లో రెండో వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.10 లక్షల నగదు, 14 తులాల బంగారం కట్నం కింద ఇచ్చారు. అనంతరం స్వప్నకు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎండీ (ఎస్‌పీఎం) సీటు వచ్చింది. సైదాబాద్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌లో భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల అనంతరం అదనపు కట్నం కోసం శ్రీధర్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. మానసిక వేదనకు గురైన ఆమె అంతకుముందు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా.. ఆమెకు మానసిక చికిత్స సైతం అందించారు.
ఆ తర్వాత కూడా భర్త శ్రీధర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఇంట్లో సగ భాగం, తల్లి బంగారు నగలు తీసుకురావాలని తీవ్రంగా వేధించడంతో మార్చి 8న స్వప్న ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ కేసులో విచారణ జరిపిన మలక్‌పేట పోలీసులు నిందితుడు శ్రీధర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
A majlis leader arrested in a Rape attemp on minor girl case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X