యువతిపై ప్రేమోన్మాది దాడి: స్కూల్లో చిన్నారిపై..

హైదరాబాద్: తనను ప్రేమించి వేరొక యువకుడితో చనువుగా ఉంటుందనే కోపంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో బాధితురాలు తృటిలో తప్పించుకోగా, అడ్డువచ్చిన స్నేహితుడికికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నగరంలోని ఎస్సానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన అనికేత్(28) డిగ్రీ వరకు చదువుకున్నాడు. గతంలో బీకేగూడకు చెందిన ఓ యువతి(21)తో స్నేహంగా ఉండేవాడు. అయితే ఇటీవల ఆమె శ్రీనివాస్(26) అనే మరో యువకుడితో చనువుగా ఉంటుందని తెలుసుకుని ఆమెపై కోపం పెంచుకున్నాడు అనికేత్.

గురువారం బీకేగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. యువతిపై కత్తితో దాడి చేసేందుకు అనికేత్ ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న శ్రీనివాస్ అతడ్ని అడ్డుకోబోయాడు. అనికేత్ జరిపిన దాడిలో శ్రీనివాస్‌కు వీపు, కడుపులో తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుడు అనికేత్ అక్కడ్నుంచి పరారయ్యాడు.

A man allegedly attacked on his lover with knife

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు అనికేత్‌ను అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గాయపడిన శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.

స్కూల్లో విద్యార్థినిపై అత్యాచారయత్నం

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలోనే నాల్గవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై బస్సు క్లీనర్ గణేష్ అత్యాచారయత్నం చేశారు. ఘటనపై స్పందించకపోవడంతో ప్రిన్సిపాల్, డ్రైవర్లను స్థానికులు చితకబాదారు.

బస్సు క్లీనర్ గణేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+