యువతిని లారీ కిందకు నెట్టిన దుండగుడు: విద్యార్థిని చితక్కొట్టిన టీచర్
ఖమ్మం: ఓ యువతిని హతమార్చేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇల్లందు మండల కేంద్రంలో ఎస్టీ ఎస్‌ఎంహెచ్ వసతి గృహంలో ఉంటున్న యువతిని శుక్రవారం ఓ యువకుడు రోడ్డుపై వెళుతున్న లారీ కిందకు నెట్టి పరారయ్యాడు.
దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ అప్రమత్తత కావడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఘటనను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. లారీ కింద తోసేసిన దుండగుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె బంధువులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌజ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. ఐదో తరగతి విద్యార్థి కనిష్క్ యాదవ్‌ను ఉపాధ్యాయుడు సుధీర్ చితకబాదాడు. విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గోల్కొండ ఆస్పత్రికి తరలించారు.
ఉపాధ్యాయుడు సుధీర్‌పై విద్యార్థి తల్లిదండ్రులు లంగర్‌హౌజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆటో బోల్తా: 10 మందికి గాయాలు
కరీంనగర్ జల్లా పెద్దపల్లి మండలం జగన్నాథపురం వద్ద శుక్రవారం మధ్యాహ్నాం ప్రమాదవశాత్తూ ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదసమయంలో ఆటో కుంటాల నుంచి పెద్దపల్లి వైపు వస్తోంది.












Click it and Unblock the Notifications