విషాదం: పెళ్లి రోజునే యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన పెళ్లి రోజు నాడే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ిన పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఇనాంగూడ గ్రామానికి చెందిన ఖాజామియా రెండో కుమారుడు మేరాజ్‌(27) బాటసింగారంలోని మౌంట్‌ ఓపెరాలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి విధులకు వెళ్లాడు.

A man allegedly committed suicide on his wedding day

శుక్రవారం ఉదయం 7 గంటల వేళ మౌంట్‌ ఓపెరా కార్యాలయం ముందు మృతిచెంది పడి ఉండగా గుర్తించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం మేరాజ్‌ తొలి పెళ్లి రోజు కావడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం ఎదురు చూస్తున్నారు.

మరో గంటలో ఇంటికి వస్తాడనుకుంటుండగా.. మరణ వార్త వారికి చేరడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. మేరాజ్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, విషం తాగి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కాగా, బాధితులకు సాయం అందించేందుకు సంస్థ యాజమాన్యం ముందుకువచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+