ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య: హాస్టల్‌లో వార్డెన్

హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్‌ జమీర్‌(36) స్థానికంగా చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.

సికింద్రాబాద్‌ రాణిగంజ్‌ డిపోకు చెందిన ఏపీ11జడ్‌7024 ఆర్టీసీ బస్సును నైట్‌ఆల్ట్‌ కోసం కూకట్‌పల్లి బస్‌ టెర్మినల్‌ వద్ద పార్కు చేసి డ్రైవర్‌ రాజేందర్‌, కండక్టర్‌ జంగయ్య రెస్ట్‌రూంలో పడుకున్నారు.

జమీర్‌ బస్సులోకి వెళ్లి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున బస్సు తీయడానికి వెళ్లిన డ్రైవర్‌, కండక్టర్‌ ఉరేసుకున్న జమీర్‌ను చూసి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు.

A man allegedly committed suicide in RTC Bus

సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు.. జమీర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేపట్టారు.

హైదర్‌గూడలో వార్డెన్ ఆత్మహత్య

హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. కళాశాల హాస్టల్‌లోని ఓ గదిలో వార్డెన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వార్డెన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+