ఫంక్షన్లో కత్తులు దూశారు: మామ చేతిలో అల్లుడు మృతి

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల మధ్య నెలకొన్ని చిన్న వివాదం వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల్లోకెళితే... పాతబస్తీ పరిధిలోని భవానీనగర్‌కు చెందిన హైదయత్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఓ వివాహ విందు(వలీమా) జరిగింది.

విందులో భాగంగా అహ్మద్ అనే యువకుడిపై అతడి మేనమామ కత్తితో దాడి చేశాడు. తన భార్యకు సంబంధించి నగల విషయంలో అల్లుడితో గొడవపడ్డ నిందితుడు ఒక్కసారిగా ఆగ్రహావేశంతో కత్తి తీసి అల్లుడిపై దాడి చేశాడు.

ఈ దాడిలో అహ్మద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. అప్పటిదాకా వేడుకగా జరుగుతున్న వలీమా ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది.

A man allegedly murdered his son in law

విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి

ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఓ కార్మికుడికి విద్యుదాఘాతంతో చనిపోయాడు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నర్వా మండలం త్రిపుర గ్రామానికి చెందిన లింగం గౌడ్ కుమారుడు రాజుగౌడ్(26)బతుకు దెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చాడు.

బాబుల్‌రెడ్డినగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటూ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం కాటేదాన్ టీఎన్‌జీఓస్ కాలనీలోని ఓ ఇంటిపై రాజుగౌడ్ స్ల్లాబు పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలకు తగిలి అపస్మరస్థితిలోకి వెళ్లాడు.

చికిత్స కోసం నగరంలోని డీఆర్‌డీఎల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పిచ్చికుక్కల స్వైరవిహారం: 10 మందికి గాయాలు

నల్లగొండ జిల్లాలోని సూర్యపేట నగరానికి చెందిన తాళ్లగడ్డలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సూర్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది కుక్కలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+